Danny Notes
5 August 2014
ప్రభుత్వం పనిచేయడంలేదు?
ప్రభుత్వం బాగా పని చేస్తోంది.
బాగా పనిచేయడం అంటే?
పూటకో కమిటీ వేయడం.
కమిటీలు పనిచేయడంలేదు.
కమిటీలు బాగా పని చేస్తున్నాయి
కమిటీలు బాగా పనిచేయడం అంటే?
నివేదికను ఎప్పటికీ ఇవ్వకపోవడం
Danny Notes
5 August 2014
వారెప్పుడూ నిద్రపోరు
నిద్రలో ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంటుతో
లోను గురించి మాట్లాడుతుంటారు
సింగపూరు, న్యూయార్కు నగరాలకు
ఆధునీకీకరణ పథకాలు తయారు చేస్తుంటారు
వారెవర్నీ నిద్రపోనివ్వరు
రైతులు ఆకాశంలోనికి చూస్తుంటారు
విద్యార్ధులు కౌన్సిలింగ్ కోసం చూస్తుంటారు
ప్రజలు రాజధాని ఎక్కడని చర్చిస్తుంటారు
Danny Notes
5 August 2014
చంద్రబాబుగారికి భద్రత అవసరంలేదు
ఎటువైపు నుండి చూసినా వారు ప్రజలకు
మూడు వందల కిలో మీటర్ల దూరంలో వుంటారు.
Danny Notes
5 August 2014
షారోన్ ప్రియాంక
'యువతి ర్యాష్ డ్రైవింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి' కేసు నిందితురాలు
షారోన్ ప్రియాంక వివరాలు నెల్లూరు మిత్రులు ఎవరయినా చెప్పగలరా?
పరిశోధన కోసం ఆమె జీవన శైలి కావాలి.
Danny Notes
6 August 2014
షేక్ హ్యాండ్ చేస్తే పరకాయ ప్రవేశం జరిగిపోతుందా?
చంద్రబాబుతో షేక్ హ్యాండ్ ఇచ్చాక కేసిఆర్ హైటెక్ భాష మాట్లాడుతున్నారు.
కరీనగర్ ను న్యూయార్క్, లండన్ లా చేస్తాను అంటున్నారు.
Danny Notes
6 August 2014
నేను ఎప్పుడూ విదేశాలకు వెళ్లలేదు.
వెళితే మాత్రం రెండు ప్రదేశాలను సందర్శిస్తాను
మదీనాలో ప్రవక్త ముహమ్మద్ (PBUH) సమాధినీ
లండన్ లో కార్ల్ మార్క్స్ సమాధినీ
Comments
Gopireddy Srinivas Reddy గారూ! మార్క్స్, ముహమ్మద్ (PBUH) ఇద్దరూ నిస్సహాయుల విముక్తి కోసం పాటుబడ్డారు. విముక్తి మార్గాల్ని ప్రవచించారు.
Gopireddy Srinivas Reddy గారూ! "సొల్లల్లాహు అలైహి వసల్లం" (PBUH) అంటే "వారి మీద శాంతి ప్రసరించుగాక" అని అర్ధం. ముస్లింలు ఎవ్వరూ ముహమ్మద్ ప్రవక్తను పూజించరు. పూజించకూడదు. ముహమ్మద్ ప్రవక్తకు శాంతి కలగాలని అల్లాను వేడుకుంటారు. నేరుగా ముహమ్మద్ ప్రవక్త 'ను' వేడుకోవడానికీ, ముహమ్మద్ ప్రవక్త 'కోసం' అల్లాను వేడుకోవడానికీ చాలా తేడా వుంది. కొందరికి ఇస్లాం ధార్మిక అవగాహన లేకపోవడంవల్ల ముహమ్మద్ ప్రవక్త సమాధికే ప్రార్ధనలు చేయడానికి ప్రయత్నిస్తూ వుండవచ్చు. నేను మార్క్స్ నూ పూజించను. ముహమ్మద్ (PBUH) ప్రవక్తనూ పూజించను. ఇద్దర్నీ అపారంగా గౌరవిస్తాను.
Comments
Gopireddy Srinivas Reddy గారూ! మార్క్స్, ముహమ్మద్ (PBUH) ఇద్దరూ నిస్సహాయుల విముక్తి కోసం పాటుబడ్డారు. విముక్తి మార్గాల్ని ప్రవచించారు.
Gopireddy Srinivas Reddy గారూ! "సొల్లల్లాహు అలైహి వసల్లం" (PBUH) అంటే "వారి మీద శాంతి ప్రసరించుగాక" అని అర్ధం. ముస్లింలు ఎవ్వరూ ముహమ్మద్ ప్రవక్తను పూజించరు. పూజించకూడదు. ముహమ్మద్ ప్రవక్తకు శాంతి కలగాలని అల్లాను వేడుకుంటారు. నేరుగా ముహమ్మద్ ప్రవక్త 'ను' వేడుకోవడానికీ, ముహమ్మద్ ప్రవక్త 'కోసం' అల్లాను వేడుకోవడానికీ చాలా తేడా వుంది. కొందరికి ఇస్లాం ధార్మిక అవగాహన లేకపోవడంవల్ల ముహమ్మద్ ప్రవక్త సమాధికే ప్రార్ధనలు చేయడానికి ప్రయత్నిస్తూ వుండవచ్చు. నేను మార్క్స్ నూ పూజించను. ముహమ్మద్ (PBUH) ప్రవక్తనూ పూజించను. ఇద్దర్నీ అపారంగా గౌరవిస్తాను.
Danny Notes
6 August 2014
Story and Confrontation
సినిమాకు కథ ప్రాణం అని
అందరికీ తెలుసు. కథకు ఏది ప్రాణం అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రతీ చర్యకూ (సమాన, తద్వెతిరేక)
ప్రతిచర్య వుంటుంది. అదే ఘర్షణ (Conflict, Confrontation). ఘర్షణని చిత్రించడమే కథ.
ఘర్షణని ఎంత లోతుగా, ఎంత విస్తారంగా చిత్రిస్తే కథాబలం అంతగా పెరుగుతుంది. పాత్రలు, స్థలకాలాలు, ప్రతిస్పందన తీవ్రతలు మారుతూ వుండడంవల్ల
కథల మధ్య వైవిధ్యం పెరుగుతుంది.
Danny Notes
6 August 2014
Chat Irritation
ఎవరో ఛాట్ లోనికి వచ్చి" HI" అన్నారు. సరే!
"బాగున్నారా?' అని అడిగారు. అదీ సరే!
"భోజనం చేశారా?" .... సరే అదీ సరే.
ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారూ? ....... చెప్పాలా అక్కరలేదా? అనే సందేహం.!
"మీరు ఎక్కడివాళ్ళు" (WRU frm). ..... కొంచెం విసుగు.
"మీ పేరేంటీ?" ...... తీవ్ర అసహనం.
"Get off" ఇలాంటి దశలో ఇది నా Common reaction.
"Why Sir?" ఇంకో ప్రశ్న!!!
Danny Notes
6 August 2014
Chat Irritation
ఎవరో ఛాట్ లోనికి వచ్చి" HI" అన్నారు. సరే!
"బాగున్నారా?' అని అడిగారు. అదీ సరే!
"భోజనం చేశారా?" .... సరే అదీ సరే.
ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారూ? ....... చెప్పాలా అక్కరలేదా? అనే సందేహం.!
"మీరు ఎక్కడివాళ్ళు" (WRU frm). ..... కొంచెం విసుగు.
"మీ పేరేంటీ?" ...... తీవ్ర అసహనం.
"Get off" ఇలాంటి దశలో ఇది నా Common reaction.
"Why Sir?" ఇంకో ప్రశ్న!!!
Danny Notes
9 August 2014
బాధితులనే తప్పుపట్టడం కొత్త తెలివితేటలు. ముస్లింల
వెనకబాటుతనానికి వాళ్ల సంస్కృతే కారణమనడం, మహిళలపై అత్యాచారాలకు వాళ్ల వస్త్రధారణ
కారణమనడం, ఈ కొత్త తెలివితేటల్లో భాగం. ఇలాంటి
ప్రకటనలు సాక్షాత్తు చట్టసభల్లో కూడా చేయడంవల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వేగంగా
వెనక్కి పరుగెడుతున్నదని మరోసారి హెచ్చరిక జారీ అయ్యింది.
Danny Notes
9 August 2014
చంద్రబాబు నోరుతెరవాలి
పంద్రాగస్టు ఉత్సవాలను పేరేడ్ గ్రౌండ్స్ లో
నిర్వహించడం ఎలా సమంజసమో, గోల్కొండ కోటలో నిర్వహించడం ఎలా ముస్లిం సంతుష్టీకరణో
కిషన్ రెడ్డి వివరిస్తే బాగుంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ
చేసిన చంద్రబాబూ ఈ విషయంలో నోరు తెరవాలి.
Danny Notes
9 August 2014
పుల్లయ్య యావారం వెళ్ళొచ్చినట్టు
వారు రోజుకో సమీక్షచేస్తారు. ఒకరోజు రాష్ట్రాన్ని మెడికల్
హబ్ చేయాలంటారు. ఇంకోరోజు సిలికాన్ వ్యాలీ చేయాలంటారు. మరుసటి రోజు సింగపూర్
చేయాలంటారు. పది న్యూయార్కులు కట్టాలంటారు. వారు ఇల్లు కదలరు. ఎవన్నీ ఎక్కడకట్టాలో
చెప్పరు. చెప్పమంటే పధ్నాలుగు కళ్ల సిధ్ధాంతం చెపుతారు.
Danny Notes
9 August
2014
ఐడేళ్ల తరువాత నిరూపించడానికి మీరెందుకిక్కడ?
Danny Notes
9 August 2014
నిన్నటి వరకు ఆయన్ను అభివృధ్ధికి ప్రతీక
అనుకునేవారు.
ఇప్పుడు వారే అభివృధ్ధిలో పక్కరాష్ట్రం సియంతో
పోటీపడతానంటున్నారు.
Notes on
Choragudi Johnson's
SWANTASANTAKAM -1
తమ సమజంలోనికి
పెట్టుబడి ప్రవేశించనంత వరకూ, అదనపు ఉత్పత్తి
ఆరంభం కానంత వరకు మానవ సమూహాలు జీవికను కాపాడుకునే వరకు మాత్రమే
ఆలోచించగలుగుతాయి. పెట్టుబడి ప్రవేశించిన
తరువాత , అదనపు ఉత్పత్తి
ఆరంభం అయిన తరువాత మానవ సమూహాల్లో ఆర్ధిక వికాసం మొదలవుతుంది. దాని గురించిన
భావసంచయనం మొదలవుతుంది.
ఆర్ధికంగా
వెనుకబడిన సమాజం సాంస్కృతికంగానూ వెనుకబడుతుంది. చాలా మంది దీన్ని తలకిందులుగా
అర్ధం చేసుకుంటారు. సాంస్కృతికంగా వెనుకబడిన సమాజం ఆర్ధికంగా వెనుకబడుతుంది అనుకుంటారు.
ఇంగ్లీషు చదువుకోవడంవల్ల మనకు ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు వస్తాయిగాబట్టి మనం ఇంగ్లీషు
చదువుకున్నాం. ఈ అంశాన్ని కార్ల్ మార్క్స్ చాలా వివరంగా చెప్పాడు. పనిముట్ల ద్వార
సామాజిక పురోగతి చరిత్రను రచించే పధ్ధతి ఇది.
Notes on
Choragudi Johnson's
SWANTASANTAKAM - 2
ఇరవై ఒకటవ శతాబ్దంలో, ముస్లిం సమాజం
అయినా, దళిత సమాజం అయినా, మరే సమాజం అయినా
ఆర్ధికంగా వెనుకబడివున్నదంటే ఆ సమాజాల్లోనికి పెట్టుబడి ప్రవేశించడాన్నీ, ఆ సమాజాల్లో అదనపు
ఉత్పత్తి పోగవడాన్నీ ఎవరో నిరోధిస్తున్నారని అర్ధం. ఆ అడ్డుకట్టల్ని తొలగించాల్సిన
అవసరం వుందని అర్ధం. ఈ అవసరాన్ని గట్టిగా గుర్తించిన మన కాలపు అలోచనాపరుల్లో
చోరగుడి జాన్సన్ ఒకరు. చీమ దూరే సందు దొరికినా బలహీనవర్గాల సమాజాల్లోనికి ఎంతో
కొంత పెట్టుబడి పారే మార్గాల్ని, అదనపు ఉత్పత్తి
జరిగే మెళుకువల్ని వారు వెతుకుతుంటారు.
Notes on
Choragudi Johnson's
SWANTASANTAKAM - 3
పెట్టుబడి ఎక్కడ పోగవ్వకూడదో
కమ్యునిస్టులకు క్షుణ్ణంగా తెలుసు. అయితే చాలా మంది కమ్యునిస్టులకు తెలియని విషయం ఏమంటే
పెట్టుబడిని ఎలా పంపిణీ చేయాలనేది, పెట్టుబడిని ఎక్కడికి మళ్ళించాలనేది. వాళ్ళు ‘రిలీజియస్’
గా పెట్టుబడినే విమర్శిస్తారు. అలాంటి ఆలోచనలకు జాన్సన్ సహజంగానే వ్యతిరేకి.
Danny Notes
9 August 2014
9 August 2014
ఆహారం, నిద్ర, మైధూనాలు శరీరధర్మలు.
మైధూనం సహజంగా లభ్యమయ్యే పరిస్థితి సమాజంలో లేదు.
అలా లేనప్పుడు అనేక అనర్ధాలు జరుగుతాయి.
చాలా సందర్భల్లో మనం అనర్ధాన్నే చూస్తాం.
ఆలోచనా పరులు చేయాల్సింది అనర్ధాలకు దారితీసే అంశాలను తొలగించడం.
గెలిచినవారు పరిపాలించాలి. వారు ఆ పని చేయనంత కాలం విమర్శించడం ప్రజాస్వామిక ధర్మం.
రెండు నెలల తరువాత సమీక్ష చేసి "చేస్తాం" అంటాడేమిటీ?
ఇదిగో ఇది "చేశాను" అని ఒక్క ముక్క కూడా చెప్పడేమిటీ?
కేసిఆర్" మూడు నెలలు ఏమీ చేయను" అని ప్రకటించి రోజూ చాలా చేస్తున్నారు. "గెలిచిన క్షణం నుండి అదరగొట్టేస్తా" అన్న మనిషి ఇంకా ఆఫీసుకే రాలేదు.
ఒక రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జాకు ఇచ్చిన పారితోషికం చాలా తక్కువ. గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్ గా అమితాభ్ బచ్చన్ కు ఇచ్చిన దాంట్లో ఇది ఎన్నవ వంతు? దీన్ని ముస్లిం సంతుష్టీకరణ అంటారా? హిందూ సంతుష్టీకరణ అంటారా?
కిషన్ రెడ్డీ, ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ కు అర్ధం అయిందోలేదో గానీ, కేసిఆర్ పాకిస్తాన్ కోడల్ని తెలంగాణ అంబాసిడర్ గా నియమించలేదు, తెలంగాణ పోరిని పాకిస్తాన్ కు అంబాసిడర్ గా పంపించారు.
No comments:
Post a Comment